ప్రజలు అందరు బిఎల్ఓ లకు సహకరించండి…..

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర ప్రభ : ప్రజలు అందరు బిఎల్ఓ లకు సహకరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు అసెంబ్లీ, నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం లోని ఫైజర్‌పేట, సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్‌మార్క్, తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్‌వోలు నిర్వహిస్తున్న విధులు, ప్రజల స్పందన, ఫారాల సేకరణ పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల్లో ప్రతి రోజూ ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి సాధిస్తుండటం ,అభినందనీయమని అన్నారు. అయినప్పటికీ మిగిలి ఉన్న ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.క్షేత్ర స్థాయి లో బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ వారికి ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజూ ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్‌లో మరింత పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రజలు కూడా బీఎల్‌వోలు తమ ఇళ్లకు వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించాలని, వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్‌వో ఏ. రవీంద్రరావు, తూర్పు నియోజకవర్గ ఈఆర్‌వో వెన్నెల శ్రీనివాస్, బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.