మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత ..
భవానిపురం ఆంధ్రప్రభ : ఎంఎల్ ఏ సుజన చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కూటమి నేతలతో కలిసి అందజేశారు. 45 వ డివిజన్, రాము క్వారీ కు చెందిన మెడిశెట్టి రజనీ (54 ) న్యుమోనియాతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఆమెకు
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 72 వేల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
35వ డివిజన్, డేవిడ్ వీధికి చెందిన పాణెం అవినాష్ ( 24) ప్లేట్స్ లెట్స్ కౌంట్ తగ్గి అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3లక్షల 60 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు పచ్చి పులుసు వెంకట శివప్రసాద్,రుద్రపాటి వెంకటేష్, దుర్బేసుల హుస్సేన్, పోలవరపు దుర్గారావు , ప్రదీప్ రాజ్, రుద్రపాటి వెంకటేష్, అడ్డూరి కొండలరావు,నంద కుమారి, పితాని పద్మ,షమీలా ఖాతూర్, గాయత్రి , జ్యోతిర్మయి , సుజన మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ..
