చెప్పిన విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా

చెప్పిన విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా

  • యార్లగడ్డ వెంకట్రావు

ఉంగుటూరు, ఆంధ్రప్రభ: చెప్పింది చేస్తా.. చేసేదే చెప్తా అని చెప్పిన విధంగా గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాననని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామం నుంచి నారయ్య అప్పారావుపేట వరకు రూ.1.12 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్డును స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మీడియా తో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండేదని, కనీసం కార్లు, ట్రాక్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొనేదని గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పదేళ్లుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న గ్రామం అని వివక్ష చూపకుండా ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్డును పూర్తి చేశామని తెలిపారు.

పొట్టిపాడు గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.4.25 కోట్ల పనులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. జిల్లా పరిషత్ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో మరో రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, వంతెన రైలింగ్ పనులు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. చెరువుల తవ్వకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ప్రభుత్వం అనుమతించిన మేరకు రెండు నుంచి మూడు అడుగుల లోతు వరకు మాత్రమే మట్టి తీయాలని, అంతకుమించి తవ్వితే ఎవరైనా సరే కేసులు నమోదు చేస్తామని అన్నారు. గతంలో చెరువులను అధిక లోతులో తవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి తీసే మట్టిని ముందుగా పేదల ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల నిర్మాణాలకు వినియోగించాలని సూచించారు.

వర్షాకాలం వచ్చేలోపు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశింలు. చెప్పింది చేస్తా.. చేసేదే చెప్తా అనే నినాదంతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునరుద్ఘాటించారు. అనంతరం స్వచ్ఛ రధాన్ని యార్లగడ్డ ప్రారంభించారు.

ఉంగుటూరు మండల ఎంపీడీఓ ఈ. సత్యకుమార్, మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, గ్రామ టిడిపి అధ్యక్షులు ఈ. రవికుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, అట్లూరి నాని, గూడపాటి వెంకటేశ్వరరావు, తాటిపాముల నాగయ్య, గుడ్డేటి సుమతి, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, కొండేటి వెంకటేశ్వరరావు, మేడేపల్లి రమ, బెజవాడ నాగేశ్వరరావు, బోనం సూరిబాబు, పెంటపాటి సీతయ్య, రమేష్, యలమర్తి నిఖిల్, రాజబోయిన శివాజీ, కొసరాజు సాయిరాం, ఎర్రగుంట్ల వినోద్, నిమ్మకూరి మహేష్, రమేష్, షేక్ సుభాని, షేక్ వలి, అట్లూరి సురేంద్ర, కడియాల బాబు, వేమారెడ్డి శ్రీనివాసరావు, కొల్లి విష్ణు, గరిమెళ్ళ వరప్రసాద్, అన్నే చైతన్య, కొమ్మారెడ్డి రాజేష్, నిమ్మకూరి మధు, చల్లగుల్ల సందీప్, కొల్లూరు చంద్రకాంత్, దారం విజయ్, కొండేటి నాగరాజు, రాజులపాటి నాగరాజు, యార్లగడ్డ విజయ్, పోతినేని బాపయ్య చౌదరి, ఏలూరు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply