పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రూరల్ డీసీపీ….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : స్థానిక పోలీస్ స్టేషన్ ను గురువారం విజయవాడ పోలీస్ కమీషనరేట్ రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమేరాలను తనిఖీ చేయటంతో పాటు పనితీరును పరిశీలించారు.
రికార్డులను తనిఖీ చేయటంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ అర్జున్, సిబ్బంది పాల్గొన్నారు.