పోచమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బి. దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, మండల ప్రధాన కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, పలువురు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ నాగవత్ సరిత ప్రభాకర్, జీపీ వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.