రేపల్లెలో స్పెషల్ పీజీఆర్ఎస్

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేపల్లె మండలం ఇసుకపల్లెలోని శ్రీ భ్రమరాంబ చెన్నమల్లేశ్వరస్వామివారి పురాణ కలాక్షేప మందిరంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను వినిపించి పరిష్కారం పొందాలని కలెక్టర్ కోరారు.