BRS | కేసీఆర్ కీలక నిర్ణయం..

BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు ఈ బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో వద్దిరాజు రవిచంద్రను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది.

ఈ మేరకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అధికారిక లేఖ పంపారు. కొత్త నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇకపై రాజ్యసభలో బీఆర్‌ఎస్ తరఫున ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర పార్టీ అభిప్రాయాలను ప్రాతినిధ్యం వహిస్తూ, వివిధ అంశాలపై పార్టీ గళాన్ని బలంగా వినిపించనున్నారు.