తెలంగాణ గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన ఎంపీ కడియం కావ్య
హనుమకొండ (ఆంధ్రప్రభ): వరంగల్ పర్యటనలో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు.
అనంతరం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వరంగల్ ప్రాంత అభివృద్ధి, విద్యా రంగ పురోగతి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
