గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుల అరెస్టు
హనుమకొండ (ఆంధ్రప్రభ): తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హనుమకొండ పర్యటన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ మైనార్టీ నాయకులను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి వారిని అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ నాయకుల కథనం ప్రకారం.. న్యూ శాయంపేటలో మైనార్టీ ఖాదీఖానా నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 25 గుంటల స్థలాన్ని కేటాయించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న సమయంలో తమను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు.
అరెస్టు చేసిన వారిలో నాయీముద్దీన్, మసూద్, మహమూద్, జుబేర్, తౌసిఫ్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.
