అక్రమంగా తరలిస్తున్న జెసిబి, మట్టి ట్రాక్టర్లు, టిప్పర్ పట్టివేత

కోడూరు – ఆంధ్ర ప్రభ : కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామపంచాయతీ శివారు కుమ్మరపాలెం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను, జెసిబి,టిప్పర్ను ఎస్ఐ చాణిక్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

బుధవారం తెల్లవారుజామున రాబడిన సమాచారం ప్రకారం ఎస్ఐ చాణిక్య సిబ్బందితో కలిసి కుమ్మరిపాలెంలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఒక జెసిపి, టిప్పర్, 8 ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు.సఅనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోడూరు తాసిల్దార్ కు ఎస్ఐ చాణిక్య సమాచారం అందించారు.