ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు

వాజేడు (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రసాద్‌బాబు నివాస ఆవరణంలో కేక్ కట్ చేసి మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చెన్నం ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్లపూడి విక్రాంత్ బాబు మాట్లాడుతూ.. గిరిజన కుటుంబంలో జన్మించిన సీతక్క ఉన్నత స్థాయికి ఎదిగి మంత్రిగా ములుగు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆమె సేవా స్ఫూర్తిని మహిళలు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వాజేడు మండల మాజీ అధ్యక్షుడు దాట్ల సీతారామరాజు, సొసైటీ ఉపాధ్యక్షుడు వత్సవాయి జగన్నాథరాజు, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలత, వాజేడు-నాగారం సర్పంచ్ బోధిబోయిన స్వరూప, ఆత్మ డైరెక్టర్ గౌరారపు వెన్నెల, వార్డు సభ్యురాలు జాక పార్వతి, నాయకులు కాకర్లపూడి కళ్యాణ్, ఎస్‌కే కాజావలి, షబ్బీర్, చెన్నం శ్రీను, చెన్నం సురబాబు, చెన్నం మోహన్‌రావు, ఎట్టి లక్ష్మయ్య, అనుముల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.