Kazipet డాక్టర్ చంద్రశేఖర్ యెలిగాటికు జాతీయ స్థాయి బాధ్యతలు
Kazipet డాక్టర్ చంద్రశేఖర్ యెలిగాటికు జాతీయ స్థాయి బాధ్యతలు
కాజీపేట (Kazipet), ఆంధ్రప్రభ: సామాజిక సేవలు, దేశభక్తి కార్యక్రమాల్లో చేసిన విశేష సేవలను గుర్తించి కాజీపేటకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ యెలిగాటిను బీజేపీ జన కళ్యాణ్ మంచ్ జాతీయ సంఘటన్ మంత్రిగా నియమించారు.
బీజేపీ జనకల్యాణ్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దర్శన్ ఆర్. షా ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ యెలిగాటి మాట్లాడుతూ సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
