గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే
హనుమకొండ (ఆంధ్రప్రభ): తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం హనుమకొండ జిల్లాలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్ఐటీ వరంగల్ అతిథి గృహంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారిని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యేలు ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
