Karnataka | జీపు–లారీ ఢీ.. ఆరు ప్రాణాలు బలి..

Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్వాడ నుంచి అంకోలాకు బయలుదేరిన తొమ్మిది మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న జీపు ఉత్తర కన్నడ జిల్లా ఎల్లాపుర పట్టణ శివారులో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.