Double-Murder : పచ్చని పెళ్లి పందిట్లో రక్తపాతం Andhra Prabha Crime News
Double-Murder : పచ్చని పెళ్లి పందిట్లో రక్తపాతం Andhra Prabha Crime News
- ఇద్దరి కిరాతక హత్య
- తిరుపతిలో దారుణం
- ఏపీలో తీవ్ర సంచలనం
( తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ)
Double-Murder : తిరుపతి నగరంలో పచ్చని పెళ్లి పందిరిలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసి రక్తపాతం సృష్టించారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏర్పేడు మండలం గొల్లపల్లి చెందిన మునిరత్నం యాదవ్ ( 40), తిరుపతి సుబ్బారెడ్డి నగర్ కి చెందిన మణికంఠ (35) మునిరత్నం తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మణికంఠ జీపు డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇద్దరు గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహానికి హాజరయ్యారు. సుమారు రాత్రి 10 గంటలకు కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న మునిరత్నం యాదవ్, మణికంఠ పై కొంతమంది వ్యక్తులు ఆకస్మికంగా కత్తులతో దాడి చేశారు. మునిరత్నం యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మణికంఠను స్థానికులు రుయా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ కొంతసేపటికి మణికంఠ మృతి చెందాడు. ఐదుగురు వ్యక్తులు హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో ఐదు మంది వ్యక్తులు వచ్చి దాడి చేసినప్పుడు సమాచారం. చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దాడి అనంతరం దుండగులు రెండు ద్విచక్ర వాహనాల్లో పరారయ్యారు. సమాచారం అందుకున్న తిరుపతి నగర డి.ఎస్.పి భక్తవత్సలం సిఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Double-Murder : ప్రేమ పెళ్లి చేసినందుకే
ఈ రెండు హత్యలు వెనక ప్రేమ వివాహంతోనే హత్యలు జరిగినట్లు సమాచారం. జంగాలపల్లి చెందిన సునీల్ తిరుమలలో దుకాణం నిర్వహిస్తున్న సంపూర్ణమ్మ కూతుర్ని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం సునీల్ కారణము లేకుండానే భార్యను వదిలేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి పద్మావతి కళ్యాణ మండపంలో జరిగే వివాహానికి సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మకి తెలిసింది. ఈ విషయాన్ని మునిరత్నం యాదవ్, మణికంఠ లకు చెప్పింది. కళ్యాణ మండపంలో సునీల్ కలిసి భార్యను ఎందుకు వదిలేసావు అంటూ గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సునీల్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా చెప్పాడు. సునీల్ తండ్రి తమ్ముడు అక్క మరో ఇద్దరు వ్యక్తులు కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. కత్తులతో మునిరత్నం యాదవ్, మణికంఠలను దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
