నూతన హాస్టల్ భవనం నిర్మించాలి
- బీజేపీ డిమాండ్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాలుర వసతిగృహం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుందని వెంటనే ఆ భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హాస్టల్ భవనాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గమ్మ అశోక్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్టల్ బిల్డింగ్ నిర్మించి 50 సంవత్సరాలు పైబడిందని దీనితో భవనం వెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. హాస్టల్ భవనంలో ఉన్న బాత్రూంలో వంటగది పూర్తిగా శిథిలావస్థలో ఉందని ఈ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు విద్యాని అభ్యసించడం కష్టతరంగా మారిందని ఇప్పటికైనా మంత్రి వివేక్ వెంకట్ స్వామి వెంటనే స్పందించి నూతన హాస్టల్ భవనం నిర్మించేందుకు కృషి చేయాలని లేనట్లయితే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
