ADB | పురుగుల మందు తాగి… ఒకరు మృతి

కాసిపేట, జనవరి 29 (ఆంధ్ర‌ప్ర‌భ‌) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన రత్నం రాజలింగు (55) గుర్తు తెలియని పురుగుల మందు తాగి మరణించాడు. గ్రామ సమీపంలోని టేకు చెట్ల ప్లాంటేషన్ లో బుధ‌వారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ కాగా, భార్య, ఇద్దరు వివాహిత, ఇద్దరు పెళ్లి కాని కూతుళ్లు వున్నారు. కాగా మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply