మొదటి తుర్కకాశ జెండా ఆవిష్కరణ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్గల్ మండలంలోని జాగిర్యాల గ్రామం బుధవారం తెలంగాణ రాష్ట్ర తుర్కకాశ సంక్షేమ సంఘం జెండాను ముఖ్యఅతిథిగా షేక్ బడేసాబ్, హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ మాట్లాడుతూ.. తుర్కకాశ సంక్షేమ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐక్యమతం మహా బలమని తెలిపారు.
ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తుర్కకాశి సంక్షేమానికి 100 కోట్లు బడ్జెట్ లక్ష్యంగా కృషి చేయాలని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం, షాదుల్లా, లీగల్ అడ్వకేట్ యమీన్ భాష, ప్రచార కార్యదర్శి సయ్యద్ ముఖేమ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నూరు మొహమ్మద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సఫాయి భాష,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ మౌలానా, వర్కింగ్ ప్రెసిడెంట్ కలీం, కోశాధికారి షేక్ సమీర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ కరీం, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ షేక్ రహీం భాష, సయ్యద్ జాన్, భీంగల్ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, ధర్పల్లి మండల అధ్యక్షుడు షేక్ ఖాజీ, తదితరులు పాల్గొన్నారు.
