బాధ్యతలు స్వీకరించిన హౌసింగ్ ఏఈ..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం హౌసింగ్ ఏఈ గా ఆడే చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన హౌసింగ్ ఏఈ ఎండీ లాయాక్ అలీ గత నెల 30న పదవీ విరమణ చేశారు.

అతని స్థానంలో జిల్లాలోని భీమినిలో పనిచేసిన ఎఈ చంద్రశేఖర్ ను జిల్లా హౌసింగ్ శాఖ పీడీ వి. బన్సీలాల్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం ఏఈ లాయక్ నుంచి చంద్రశేఖర్ చార్జి తీసుకున్నారు.