ఆంధ్రప్రభ వెబ్ కథనానికి స్పందన.. రైతుల సమస్యకు పరిష్కారం

గొల్లపల్లి, (ఆంధ్రప్రభ): ఈ నెల 3న “ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తుల్లో జాప్యం” శీర్షికతో ఆంధ్రప్రభ వెబ్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

దీంతో విద్యుత్ సరఫరా సమస్య తొలగి, ట్రాన్స్‌ఫార్మర్‌పై ఆధారపడి సాగు చేస్తున్న రైతుల ఇబ్బందులు తీరాయి. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడిన ఆంధ్రప్రభకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.