NEWS@12:00 A.M | 8 జూలై 2026 ముఖ్యాంశాలు

బ్రహ్మోత్సవాల నాటికి ఈ-బస్సులు

తిరుమలలో భక్తులకు మరింత పర్యావరణహిత, ఆధునిక రవాణా సేవలు అందించేందుకు టీటీడీ చర్యలను వేగవంతం చేసింది. రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సులను రానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. click here to read full news

Suryapet | కాంగ్రెస్ నేతల మధ్య ఘ‌ర్ష‌ణ‌..

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. click here to read full news


వైఎస్సార్‌కు ఘన నివాళులు..

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. click here to read full news

Amarnath | మంచు శివలింగం అంతర్ధానం..

వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. మే నెలలో సుమారు ఏడు అడుగుల ఎత్తుతో కనిపించిన మంచు శివలింగం ప్రస్తుతం 99 శాతం మేర క్షీణించినట్లు అధికారులు వెల్లడించారు. click here to read full news

Sensex | మదుపర్లకు నిరాశ .. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత సెషన్ ముగింపుతో పోలిస్తే ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు ఎర్రబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, కొన్ని కీలక రంగాల్లో అమ్మకాలు జోరందుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. click here to read full news