పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

వరంగల్, ఆంధ్రప్రభ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. ఈ వార్త పవన్ కల్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

మూడేళ్ల వయస్సులోనే నిరంజన్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ప్రస్తుతం అతనికి 17 ఏళ్లు వచ్చినప్పటికీ, శారీరక ఎదుగుదల మాత్రం నాలుగేళ్ల చిన్నారి స్థాయిలోనే ఉండేది. తన ఆరోగ్య పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్‌పై అతనికి ఉన్న అభిమానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.

కొద్ది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ కల్యాణ్ తన ఇంటికి రావడం నిరంజన్‌కు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయితే తాజాగా నిరంజన్ మృతి చెందడంతో అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.