హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి..ఈ ఉత్సవాలు ఏడో తేది వరకు కొనసాగుతాయి.. –
ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలుకు సోమవారం నాడు అనుకూరార్పణంతో చేశారు..ఇక బ్రహ్మోత్సవాల్లో ఆరంభ సూచికగా ధ్వజారోహణం గావించారు. అనంతరం ఉదయం శేష వాహన సేవ నిర్వహించారు.. రాత్రికి శ్రీ హనుమంత హహన సేవ జరగనుంది…అలాగే వివిధ రోజులలో గరుడ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, గజ వాహనం, అశ్వ వాహనం , రథోత్సవం, అన్నప్రసాదం పంపిణీ తదితర వేడుకలు జరుగుతాయి.
వివరమైన కార్యక్రమాల షెడ్యూల్:
• జూన్ 3 (సోమవారం):
• ధ్వజారోహణం: ఉదయం 6:30 నుండి 8:45 వరకు
• శేష వాహన సేవ: ఉదయం 10 నుండి 11 వరకు
• శ్రీ హనుమంత వాహన సేవ: రాత్రి 8 గంటలకు
• జూన్ 4 (మంగళవారం):
• సూర్యప్రభ వాహనం: ఉదయం
• చంద్రప్రభ వాహన సేవ: రాత్రి 8 గంటలకు
• జూన్ 5 (బుధవారం):
• గజ వాహన సేవ: ఉదయం 8:30 గంటలకు
• శ్రీవారి శాంతి కల్యాణం: ఉదయం 10:30 గంటలకు
• గరుడ వాహన సేవ: రాత్రి 8 గంటలకు
• జూన్ 6 (గురువారం):
• రథోత్సవం: ఉదయం
• అశ్వ వాహన సేవ: సాయంత్రం
• జూన్ 7 (శుక్రవారం):
• చక్రస్నానం: ఉదయం 11:30 గంటలకు
• పుష్పయాగం: సాయంత్రం 6 గంటలకు
• ద్వజావరోహణం (ఉత్సవ ముగింపు): రాత్రి 9 గంటలకు