Arvind Kejriwal | పెట్రోల్ బంకుల్లో E10, E20, E0 ఆప్షన్ ఇవ్వాలి

  • అరవింద్ కేజ్రీవాల్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో ఇంధన విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల్లో కేవలం E20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు ఎంపిక చేసే అవకాశం లేకుండా పోతోందని ఆయన అన్నారు.

ప్రతి పెట్రోల్ బంకులో E10, E20, అలాగే ఎథనాల్ కలపని సాధారణ పెట్రోల్ (E0) కూడా అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినియోగదారులు తమ వాహనానికి అనుకూలమైన ఇంధనాన్ని స్వయంగా ఎంచుకునే అవకాశం కల్పించాలని సూచించారు.

దేశంలో సుమారు 22 కోట్ల ద్విచక్ర వాహనాలు, 8 కోట్ల కార్లు ఉన్నాయి. వీటిలో అన్నీ E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేవని, పాత మోడల్ వాహనాల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.

అందుకే ఒకే రకమైన ఇంధనాన్ని తప్పనిసరి చేయకుండా, E0, E10, E20 వంటి మూడు రకాల పెట్రోల్‌ను బంకుల్లో అందుబాటులో ఉంచితే వినియోగదారులు తమ వాహనం అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.