Gujarat-High-Court | 38మందికి మరణశిక్ష..

Gujarat-High-Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దిగువ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు సమర్థించింది.

దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన సభ్యులుగా పేర్కొన్న నిందితులకు విధించిన శిక్షలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో 38 మందికి విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవితఖైదు శిక్షను హైకోర్టు కొనసాగించింది. దీంతో నిందితులకు న్యాయపరంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.

2008 జూలైలో అహ్మదాబాద్ నగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం పలువురిపై అభియోగాలు నమోదు చేసి, దిగువ కోర్టు శిక్షలు విధించింది.