ఎట్టకేలకు బుడ్డోడికి ఛాన్స్..!
- వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆంధ్రప్రభ, క్రీడా విభాగం : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
కాగా, ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఎట్టకేలకు భారత జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు. వీరి స్థానంలో సకీబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్‌కు విశ్రాంతి ఇచ్చారు.
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వైభవ్ సూర్యవంశీకి క్యాప్‌ను అందించాడు. 15 సంవత్సరాల, 99 రోజుల వయస్సులో, అతను సీనియర్ భారత క్రికెట్ జట్టుకు ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవనున్నాడు.
భారత్ తుది జట్టు
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ తుది జట్టు
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
