RCB vs PBKS | టాస్ ఆలస్యం.. మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు !

బెంగ‌ళూరు : ఈరోజు బెంగ‌ళూరు వేదిక‌గా ఆర్సీబీ – పంజాబ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో టాస్ ఆలస్యంగా ప‌డింది. 9:30 గంట‌ల‌కు టాస్ వేయ‌గా.. పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

భారీ వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది. సాయంత్రం 7 గంటలకు జరగాల్సిన టాస్‌ను రాత్రి 9:30 గంటలకు ప‌డింది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లేలో 4 ఓవర్లు ఉంటాయి. ముగ్గురు బౌలర్లు మూడు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఒక బౌలర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది.

తుది జ‌ట్లు :

ఆర్సీబీ : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, ర‌జ‌త్ పాటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శ‌ర్మ‌, య‌శ్ ద‌యాల్.

పంజాబ్ కింగ్స్ : ప్రియాన్ష్ ఆర్య‌, నేహ‌ల్ వ‌ధేరా, శ్రేయ‌స్ అయ్య‌ర్(కెప్టెన్), శ‌శాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్), స్టోయినిస్, మార్కో యాన్సెస్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, గ్జావియ‌ర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, చాహ‌ల్.

హెడ్‌-టు-హెడ్‌..

ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్, ఆర్సీబీ జట్లు ప్రతి మ్యాచ్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. అంచనాలకు మించి రాణిస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. దీంతో ఈరోజు మ్యాచ్ లోనూ గెలిచి ప్లే-ఆఫ్ రేసుకు దగ్గరగా వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

ఐపీఎల్లో పంజాబ్, ఆర్సీబీ జ‌ట్లు ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ క్ర‌మంలో నేటి మ్యాచ్ లో ఇరు జ‌ట్ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్‌సిబి 6 మ్యాచ్‌లు ఆడి 4 గెలిచింది. సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. మరోవైపు, పంజాబ్ కూడా 6 మ్యాచ్‌లు ఆడి 4 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇరు జ‌ట్ల ఖాతాల్లో 8 పాయింట్లే ఉన్నాయి. అయితే.. బెంగ‌ళూరు నెట్‌ర‌న్‌రేట్ +0.672తో 3వ స్థానంలో ఉండ‌గా… పంజాబ్ నెట్‌ర‌న్‌రేట్ +0.172 తో 4వ స్థానంలో ఉంది.

Leave a Reply