sanaatana | తరతరాలకూ మార్గదర్శకం..
sanaatana | తరతరాలకూ మార్గదర్శకం..
sanaatana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సనాతన ధర్మం బలమైన నాయకులతో కూడిన పౌరాణిక, ఇతిహాస చరిత్రల(history) సమాహారం. ఈ జీవన విధానం ఆశాజనికమైన బలపరాక్రమ శౌర్యాలను సదా అందిస్తూ మానవులను ముందుకు నడిపిస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పదునాలుగు సంవత్సరాల వయసులోనే తమను చంపడానికి వస్తున్న కువలయాపేడమను ఏనుగుని బలరామునితో కలిసి చంపి దాని దంతాలను పెకలించాడు. రక్తమోడుతున్న దంతాలను చేత ధరించి వస్తున్న వారిని చూసి ముధురపుర వాసులు ఆశ్చర్యచకితులైనారు.

రాక్షసాకారులైన చాణూర, ముష్టియను మల్లయోధులను మట్టికరిపించారు. మధురకు ఆహ్వానించి కృష్ణబలరాముల(Krishna Rama)ను అంతం చేద్దామనుకున్న కంసుని పన్నాగమును పటాపంచలు చేసి అవలీలగా కరవాలంతో వధించాడు. పితామహ, తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించాడు. అష్టమహిషులతోబాటు, పదదారు వేలమందికి తన దివ్యప్రేమను అందించిన ధీశాలి శ్రీకృష్ణుడు(Lord Krishna). అంతమంది భార్యలతో ఒక గృహస్థుగా గెలిచినందుకు ఆయన ధీశాలే !
ఇక బలరాముడు పేరుకు తగ్గట్టే ఒకసారి హస్తినాపురాన్ని తన హలాయుధంతో భూకంపం వచ్చేలా త్రవ్వి యమునా నదికి ఆనకట్ట కట్టబోయాడు. ఇంకొక బల ప్రతీక భీముడు. ఈయన గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. బాల్యంలో తల్లి కుంతి ఒడిలోంచి జారిపడితే గండశిలే ముక్కలైపోయింది., వేయి ఏనుగులకు సమానమైన బలం కలవాడు.
sanaatana | స్వయంగా రహస్య సొరంగం త్రవ్వి
అంతటి బలవంతుడైనా అన్న ధర్మరాజు(Dharmaraja) మాటను జవదాటలేదు. ద్రౌపదికి జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారంగా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రుధిరాన్ని గ్రోలాడు. లక్క ఇంటిలోనుండి స్వయంగా రహస్య సొరంగం త్రవ్వి దాని ద్వారా నిద్రాభంగమ కలగనంత సొంపుగా సోదరులను, తల్లిని రక్షించాడు. హిడింబి ద్వారా తనకంటే బలవంతుడైన ఘటోత్కచుని(Ghatotkachu) కన్నాడు. త్రేతాయుగానికి వెడితే శ్రీరాముని ధర్మపరాక్రమం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. తాటకిని సం హరించిన శ్రీరామునికి పట్టుమని పన్నండేళ్ళు లేవు
బలమైన ఏడు సాల వృక్షాలను ఒకేసారి తన బాణంతో కూల్చి సుగ్రీవునకు తన పరాక్రమాన్ని చూపాడు. ఇక ఆంజనేయుని విశ్వరూపం రామ-రావణ సంగ్రామంలో మనకు తెలిసిన విషయమే. హనుమ చూపిన ప్రతి ప్రదర్శన(Exhibition) ప్రతి ఒక్కరికీ అనుసరణీయం. ఆంజనేయ రూపం చూసినా, నామం పలికినా సకల భయాలూ దూరంగా పారిపోతాయి. ఇంకా అనేక మంది వీరులు, వీర నారీమణుల వీరగాధలు అనేకం.

sanaatana | ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
ఇంతటి బలవర్ధకమైన సనాతన వాంగ్మయ భాండాగారం నుండి ఈ కలి యుగంలోని యువత ఏమి నేర్చుకుంటోంది? మత్తుకు బానిసలై పిరికి తనంతో స్వార్థాన్ని ఆశ్రయించి బలహీనులై కుంచించుకు పోతున్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక మహా పాపమైన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు. అహంకారాలతో నిత్యం అర్థం లేని పోట్లాటలు కొనసాగిస్తున్నారు మరి కొందరు. ఇటువంటి దుర్భర పరిస్థితి నుండి యువతీ యువకులు(Youth) బయట పడాలి. మన సనాతన ధర్మం యొక్క నాయకుల బల పరాక్రమాలను ఆదర్శంగా తీసుకొని జీవన పోరాటంలో ధర్మం యుద్ధం చేసే దిశగా విజయం సాధించాలి.
“గీతాధ్యయనం కంటే ఫుట్ బాల్(Football) ఆడడం ద్వారా స్వర్గానికి దగ్గరవుతాం” అన్నారు స్వామి వివేకానంద. వారి మాటలలోని అంతరార్థం గ్రహించి, యువతీ యువకులు కిశోరాలై ముందుకు ఉరకాలి. ధైర్యసాహసాలతో నిలవాలి.
-వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
click here to read 15 types of | సర్వమంగళ నీరాజనమే హారతులు
