Power Star | బాబాయ్ – అబ్బాయ్ కాంబో మూవీ..?

Power Star | బాబాయ్ – అబ్బాయ్ కాంబో మూవీ..?
Power Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్.. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటూ గత కొంత కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. సినిమా (Movie) మాత్రం రావడం లేదు. ఎప్పుడో ఈ క్రేజీ కాంబోలో మూవీ గురించి వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ కాంబిషన్ లో సినిమా అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఓ వైపు పవన్ బిజీగా ఉన్నారు. మరో వైపు చరణ్ బిజీగా ఉన్నారు. మరి.. ఈ క్రేజీ కాంబో మూవీ సాధ్యమేనా..?

పవన్ కళ్యాణ్ తన పేరుతో పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. నితిన్ తో ఛల్ మోహన్ రంగ అంటూ ఓ సినిమాను నిర్మించారు. ఆతర్వాత రామ్ చరణ్ తో (Ram Charan) అదే బ్యానర్ లో సినిమా అంటూ ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే.. ఛల్ మోహన్ రంగ సినిమా ఫ్లాప్ అవ్వడం.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో చరణ్ తో సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. పవన్ ఇప్పుడు నిర్మాతగా వరుసగా సినిమాలు తీయాలి అనుకుంటున్నారు. దీంతో మళ్లీ చరణ్ తో పవన్ సినిమా అనేది వార్తల్లో నిలిచింది.

పవన్ కళ్యాణ్.. (Pawankalyan) ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి చర్చించేందుకు ఇటీవల పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కలిసారు. భవిష్యత్ లో సంయుక్తంగా సినిమాలు నిర్మించే పెద్ద ప్లానే రెడీ చేశారు. అయితే.. వీరిద్దరూ కలిసి నిర్మించే సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీంతో ఈ క్రేజీ కాంబో మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలో ఈ క్రేజీ మూవీ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

