Breaking news | ప్రధాని మోదీకి బెదిరింపులు…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేదికగా బెదిరింపులు రావడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఆస్ట్రేలియా టుడే’ ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న “మెల్బోర్న్ మీట్స్ మోదీ” కమ్యూనిటీ ఈవెంట్కు సంబంధించి ఫేస్బుక్ పోస్టు కింద ఈ బెదిరింపులు వెలువడినట్లు పేర్కొంది.
ఈ బెదిరింపులపై స్పందించిన ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాయి. బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ సందేశాలు పంపించారనే కోణంలో లోతుగా విచారణ కొనసాగుతోంది.
