దొడ్డి కొమరయ్య పోరాటం చిరస్మరణీయం: నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం దొడ్డి కొమరయ్య చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొంటూ, అమరవీరుల ఆశయాలను కాపాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
