అయ్యా మాకు ఓటు హక్కు లేదంటా..

అయ్యా మాకు ఓటు హక్కు లేదంటా..

ఎమ్మెల్యే దృష్టికి వామ్భే కాలనీ వాసులు విన్నపం..
సర్ కార్యక్రమంలో అధికారులు స్పష్టం చేస్తున్నారని..
వామ్భే కాలనీ వాసులు ఆవేదన..
అందరికి ఓటు హక్కు కల్పిస్తాం.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : అయ్యా మాకు ఓటు హక్కు లేదంటా అని స్థానిక60వ డివిజన్ వామ్భే కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకువచ్చారు.ఇటీవల ప్రభుత్వం సర్ కార్యక్రమం ద్వారా ఓటు హక్కు అందరికి కల్పించాలని ఆదేశాలు జారీచేశారు.ఐతే సంబందిత సర్అధికారులు ఎన్యుమరేషన్ కార్యక్రమంలో మీకు ఓటు హక్కు లేదంటూ స్పష్టం చేస్తున్నారని వామ్భే కాలనీ వాసులు శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బొండా ఉమా దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే బొండా ఉమా సంబందిత అధికారులకు అందరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఈవిషయంపై డివిజన్ ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజుతో బిఎల్ఓ లతో మాటడాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ గతంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు అనేక వినతులు తీసుకోని వచ్చేవారు.ఇప్పడు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆ సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అన్నారు.ఇప్పడు అర్జీదారుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నది ఆ రీతిగా సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అన్నారు. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా అర్హులకు పించన్ అర్హత లేకపోతే ఎమ్మెల్యే సొంత నిధులతో పించన్ అందజేస్తున్నామని అన్నారు.పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ఎమ్మెల్యే ప్రజలకు ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి. ఏ భార్గవ్, శివ,కార్యాలయం ఇంచార్జి ఘంటా కృష్ణమోహన్,సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి శ్రీను,కంచేటి నాగరాజు,పిరియా సోము జగదాంబ,డిడినాయుడు, మెహర్ బాషా, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.