ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ అమెరికా విద్య..

  • దిక్సూచి ఫౌండేషన్ ప్రతినిధులు..

జన్నారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన ఆన్లైన్ అమెరికా విద్యను అందిస్తున్నట్లు అమెరికా వాసులు,దిక్సూచి ఫౌండేషన్ ప్రతినిధులు గాజుల లాస్య, తిరుమలశెట్టి హంసిని తెలిపారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ను శుక్రవారం వారు సందర్శించి,ఇంగ్లీష్ భాషలో విద్యార్థుల సమర్థ్యాన్ని పలు ప్రశ్నలు అడిగి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,యుఎస్ఏ నుంచి గత సంవత్సర కాలంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.

విద్యాపరంగా విద్యార్థులను మరింత బలోపేతం చేయడానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని,ప్రస్తుతం విద్యార్థుల సామర్థ్యం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.అమెరికా నుంచి స్కూలుకు వచ్చిన వారికి ఆ పాఠశాలల హెచ్ఎం బొడ్డు కిషన్, ఉపాధ్యాయులు నర్సయ్య,శ్రీలత,విమల, సుజాత,మంజులలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో దిక్సూచి ఫౌండేషన్ సభ్యులు బండారి మారుతీరాజ్,కె.ఎ నర్సింహులు, అంకం మహేష్,గాజుల దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.