Spain-Enters-Round-16 : మిగెల్​ అద్భుతం Andhra Prabha Sports Story

Spain-Enters-Round-16 : మిగెల్​ అద్భుతం Andhra Prabha Sports Story

  • స్పెయిన్​ వన్​ సైడ్​..
  • ఆస్ట్రియా టఫ్​ ఫైట్​ ఫెయిల్​
  • ఏక పక్ష విజయంతో..
  • ప్రీక్వార్టర్స్​ లో స్పెయిన్​
  • ఇక పోర్చుగల్​ తో పోరు

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి)

అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రియా జట్టును 3-0 గోల్స్​ తేడాతో ఓడించి,
సునాయసంగా రౌండ్ ఆఫ్ 16 (ప్రీ-క్వార్టర్స్) లోకి స్పెయిన్​ అడుగుపెట్టింది.ఈ ఇక తదుపరి పోరాటం సోర్చుగల్​ తో చేస్తుంది. ఈ మ్యాచ్‌లో మికెల్​ ఓయార్జబల్ సూపర్ ఫామ్‌లో కనిపించాడు. రెండు అద్భుత గోల్స్ చేసి స్పెయిన్ విజయానికి ప్రధాన సూత్రధారిగా నిలిచాడు. మ్యాచ్ ఆరంబం నుండి చివరి వరకు డిఫెన్స్​, అటాకింగ్ విభాగాల్లో ఆస్ట్రియాపై ప్పెయిన్​ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చింది. ఆస్ట్రియా స్ట్రైకర్లకు స్పెయిన్ డిఫెండర్లు అసలు అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో స్పెయిన్ ఈ 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలం చేసుకుంది.

Spain-Enters-Round-16 : స్పెయిన్​ వన్​ సైడ్​ దూకుడు

ఆది నుంచి స్పెయిన్​ జట్టు ఆధిపత్య ప్రదర్శనతో దూకుడు పెంచింది. ఈ మ్యాచ్​ 20వ నిమిషంలో లమిన్ యమల్ కొట్టిన కార్నర్ కిక్ తో దొరికిన బంతిని మార్క్ కుకురెల్లా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అయితే, ఆస్ట్రియా గోల్‌ కీపర్‌ను స్పెయిన్ ఆటగాడు పావ్ కుబార్సి ఫౌల్ చేసినట్లు గమనించి , VAR తర్వాత ఆ గోల్‌ను అంపైర్ రద్దు చేశారు. 25వ నిమిషంలో స్పెయిస్​ స్ట్రైకర్ మిగెల్ ఓయార్జబల్ కొట్టిన లో-షాట్‌ను ఆస్ట్రియా కీపర్ అలెగ్జాండర్ ష్లాగర్ అద్భుతంగా డైవ్ చేసి గోల్​ ను అడ్డకున్నాడు. 36వ నిమిషం లో స్పెయిన్​ తొలి గోల్​ చేసింది. పెడ్రి అందించిన అద్భుత పాస్‌ను లెఫ్ట్ వింగ్ నుండి మార్క్ కుకురెల్లా క్రాస్ చేయగా, మిగెల్ ఓయార్జబల్ చాలా ప్రశాంతంగా గోల్‌కీపర్ పక్క నుండి నెట్ లోకి పంపాడు. దీంతో స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం లభించింది. 42వ నిమిషంలో అలెక్స్ బేనా ఫ్రీ-కిక్ బంతి నేరుగా గోల్ పోస్ట్ పైభాగానికి తగిలి వెనక్కి వచ్చింది. తిరిగి వచ్చిన బంతిని యమల్ కొట్టినప్పటికీ కీపర్ మళ్లీ అడ్డకున్నాడు.

Spain-Enters-Round-16 : ఆస్ట్రియా వ్యూహం ఫెయిల్​

మ్యాచ్​ రెండవ భాగం 60వ నిమిషంలె ఆస్ట్రియా కోచ్ రాల్ఫ్ రంగ్‌నిక్ జట్టులో మార్పులు చేశాడు. పొడుగు స్ట్రైకర్లు అల్నాటోవిక్, కాలాజ్డిక్‌లను మైదానంలోకి దించారు. కాలాజ్డిక్ హెడర్ ద్వారా గోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ బంతి పోస్ట్‌పై నుండి వెళ్ళిపోయింది. 66వ నిమిషంలో కుకురెల్లా నుండి బంతిని అందుకున్న అలెక్స్ బేనా ఒక అందమైన షార్ట్ క్రాస్ అందించగా, దూసుకొచ్చిన డిఫెండర్ పెడ్రో పోర్రో తన కెరీర్‌లోనే తొలి అంతర్జాతీయ గోల్‌ను బుల్లెట్ లాంటి హెడర్ ద్వారా సాధించాడు. 75వ నిమిషంలో యమల్ కొట్టిన మరో ప్రమాదకర షాట్‌ను ఆస్ట్రియా సీనియర్ ప్లేయర్ డేవిడ్ అలాబా గోల్ లైన్ వద్దే నిలిపివేసి క్లియర్ చేశాడు. 89వ నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా మార్క్ కుకురెల్లా లెఫ్ట్ సైడ్ నుండి అందించిన పిన్‌పాయింట్ లో-క్రాస్‌ను అన్‌మార్క్‌డ్‌గా ఉన్న మిగెల్ ఓయార్జబల్ నెమ్మదిగా స్లాట్ చేస్తూ తన రెండో గోల్‌ను పూర్తి చేశాడు. దీంతో 3 – 0 ఆ
ధిక్యంతో ఆస్ట్రియా పై స్పెయిన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అంతటా 23 షాట్లు కొట్టి, ఆస్ట్రియాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా సంపూర్ణ ఆధిపత్యంతో రౌండ్ ఆఫ్ 16కు స్పెయిన్​ అర్హత సాధించింది. ఇక ప్రీ క్వార్టర్స్​ లో సారనఖ క్లినికల్​ స్పెషలిస్ట్​ రొనాల్డో జట్టు తో ఈ మిగెల్​ జట్టు తలపడబోతోంది.