విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలి
నూతన డిప్యూటీ ఈఈలకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచన
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన డిప్యూటీ ఈఈలకు సూచించారు. విద్యుత్ శాఖ అవనిగడ్డ సబ్ డివిజన్ నూతన డిప్యూటీ ఈఈగా బాధ్యతలు చేపట్టిన పామర్తి నాగరాజు, చల్లపల్లి సబ్ డివిజన్ నూతన డిప్యూటీ ఈఈగా బాధ్యతలు చేపట్టిన పేర్ని రవికుమార్ గురువారం సాయంత్రం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన పనులపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఏఈఈ ఎస్.వీ.వీ.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
