జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: పాలకుర్తి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాపోలు లక్ష్మణ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాపోలు లక్ష్మణ్ నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పాలకుర్తి ప్రాంతంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బైరు భార్గవ్, బొమ్మగాని భాస్కర్, బక్క పుల్లయ్య, కూస భాస్కర్ రెడ్డి, కామారపు సునీల్, బానోత్ కిషన్, హనుమాన్ల నరేందర్ రెడ్డి, చుంచు సంతోష్, మేరుగు మల్లేశం గౌడ్, గడ్డం బాబు, సంగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
