నల్లగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంగుల సైదులు
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: నల్లగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అప్పాజీపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గంగుల సైదులు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నియామకంపై గంగుల సైదులు యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరు లక్ష్మయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అప్పాజీపేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
