ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి..
వీరులపాడు, ఆంధ్రప్రభ : ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దాపురంలో గురువారం సాయంత్రంచోటుచేసుకుంది. వీరు లపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన నిమ్మల అచ్చమ్మ (50) సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామ శివారులో రోడ్డు దాటుతున్న క్రమంలో జయంతి నుండి పెద్దాపురం వస్తున్న ట్రాక్టర్ గ్రామ శివారులో ఢీకొన్నది. ఈ ఘటనలో మహిళ అచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అభిమన్యు ఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన సంఘటనపై విచారించారు. అచ్చమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమాన్యూ తెలిపారు.
