suicide | తమ్ముడి అంత్యక్రియల దగ్గరే…

suicide | తమ్ముడి అంత్యక్రియల దగ్గరే…
suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
అన్నమయ్య జిల్లా నక్కపల్లి మండలంలోని రమణయ్యపేట గ్రామానికి చెందిన కర్రి నరేంద్ర (40), కృష్ణార్జున కుమార్ (37) అన్నదమ్ములు. కుటుంబంపై ఉన్న అప్పుల ఒత్తిడి కారణంగా ఈనెల 16న తమ్ముడు కృష్ణార్జున కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేకపోయిన అన్న కర్రి నరేంద్ర, ఈ నెల 19న అతని అంత్యక్రియలు జరిగిన శ్మశానం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేంద్ర మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
