పారిశ్రామిక వాడల అభివృద్ధికి కొత్త దిశలో రాష్ట్రం అడుగులు

పారిశ్రామిక వాడల అభివృద్ధికి కొత్త దిశలో రాష్ట్రం అడుగులు

విజయవాడ, ఆంధ్రప్రభ :
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. పెట్టుబడులను, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెల్లడించారు. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి జాయింట్ వెంచర్ విధానంలో ప్రైవేటు భూయజమానులతో కలిసి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం డెవలపర్‌గా వ్యవహరించి, భూముల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి వాటిని పారిశ్రామిక పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ పార్కులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ “ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కొత్త విధానం భూయజమానులకు కూడా మంచి అవకాశమని కలెక్టర్ అన్నారు.

ఆసక్తి ఉన్న భూయజమానులు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ (98857 29555) లేదా ఇన్వెస్టర్ డెస్క్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.


Leave a Reply