వైద్యాధికారులను సన్మానించిన లయన్స్ క్లబ్
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేరేడుచర్లలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పున్నా నాగిని, ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ శృతి లను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య వృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రదమైనదని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆసుపత్రికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యూసఫ్, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సరికొప్పల నాగేశ్వరరావు, చిత్రం విశ్వనాథం, రాచకొండ అంజయ్య, గుండా సత్యనారాయణ, వైద్య సిబ్బంది నర్సయ్య, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
