రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
రేణిగుంట, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కేంద్ర మంత్రిని ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్‌రావు, రాస్ చైర్మన్ వెంకటరత్నం, రాస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ శ్రీలత, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు.

