IPL 2026 : బుకీలపై ఉక్కుపాదం Andhra Prabha Top Story

IPL 2026 : బుకీలపై ఉక్కుపాదం Andhra Prabha Top Story

  • తెరమీదకు డగౌట్​
  • ఫోన్లకు నో ఎంట్రీ
  • కౌగిలింతలు లేవ్​..
  • హోటల్​ రూమ్​ ల్లో నో ప్రైవేట్​
  • బీసీసీఐ కఠిన ఆంక్షలు
  • బెట్టింగ్ టర్నోవర్ లక్షల కోట్ల ఆట
  • హనీ ట్రాప్ ఇక బ్రేక్​
  • అడ్డంగా దొరికిన క్రికెట్ స్టార్లు
  • ఫ్రాంచైజీల్లో అలజడి ఎందుకు?
  • యజమానులకు కూడా కఠిన ఆంక్షలు
  • స్పాట్ ఫిక్సింగ్ కట్టడే అసలు లక్ష్యమా?
  • బుకీల కట్టడి సాధ్యమా? అసాధ్యమా?

( ఆంధ్రప్రభ, స్పోర్ట్స్​ ప్రతినిధి)

IPL 2026

కిక్​ డోస్​.. అంటే ఐపీఎల్​ టోర్నీ అని వరల్డ్​ క్రికెట్​ అభిమానుల అభిప్రాయం. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే కాదు.. వీలుంటే పది సిక్పర్లు కొట్టే బ్యాట్స్​ మెన్​.. ఈ రోజు ఐసీఎల్​ లో.. బాహుబలిగా అవతరిస్తున్నారు. ఆరు బంతుల్లో 10 సిక్సర్లా.. ఔరా ఇది సాధ్యమా? అంటే.. పదే కాదు…బౌలర్​ నోబాల్ సంధించే ​ సంఖ్య పెరిగే కొద్దీ సిక్సర్ల వర్షం ఖాయం. ఇదీ నేటి ఐపీఎల్​ స్థితి గతి. ఈ సంగతి సరే.. జట్లు మైదానంలోకి రాక ముందే.. ఏ జట్టు గెలుస్తుందో.. నేటి కుర్రకారు ఇట్టే జాతకం చెప్పేస్తుంటే.. బెట్టింగ్​ టర్నోవరు గ్రాఫ్​ అలా… అలా.. ఆకాశం వైపు దూసుకుపోతోంది. ఇక 3.20 గంటల విరామం కొందరు లక్షాధికారులైతే… మరి కొందరు బిక్షకులై బావురు మంటున్నారు. ఇక అప్పుల ఊబిలో ఇంకొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధాన బాధితులు మధ్యతరగతి జీవులే.

IPL 2026 : బెట్టింగ్​ టర్నోవరు తెలుసా?

IPL 2026

ఇప్పటికి భారత దేశంలో 18 ఐపీఎల్​ ఎడిషన్లు ముగిశాయి. తాజాగా 19వ ఎడిషన్​ దూసుకు పోతొంది. ఈ ఐపీఎల్ సీజన్​ లో బెట్టింగ్ దందా అనూహ్య స్థాయిలో జరుగుతోంది. తాజా అంచనాల ప్రకారం , ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌పై సుమారు ₹5,000 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతోందని బుకీల అంచనా. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి ఈ బెట్టింగ్ టర్నోవరు $ 15 బిలియన్లు (సుమారు ₹1.25 లక్షల కోట్లు) దాటవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 2024 సీజన్ 60 రోజుల విండోలో సుమారు ₹8.3 లక్షల కోట్ల బెట్టింగ్​ లావాదేవీలు జరిగినట్లు సమాచారం, ఇదే ఇప్పటి వరకూ రికార్డు. 19 ఏళ్లకు ఐపీఎల్​ ఎడిషన్​ లో బెట్టింగ్​ వ్యవహారంపై బీసీసీఐ కళ్లు తెరిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో డగౌట్ క్రమశిక్షణ, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై బీసీసీఐ (BCCI) తీవ్రంగా స్పందించింది. కఠిన చర్యలకు దిగింది. ఐపీఎల్​ జట్లు.. ఫ్రాంచైజీలకు గట్టి వార్నింగ్​ ఇచ్చింది. ఏడు పేజీల కొత్త నిబంధనలను తెరమీదకు తీసుకు వచ్చింది. ఈ నిబంధనలన్నీ … బుకీలకు బ్రేకింగ్​ న్యూసే.

IPL 2026 : డగౌట్ అంటే ?

IPL 2026

క్రికెట్ మైదానం సరిహద్దు (boundary) పక్కనే ఆటగాళ్ళు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది విడిదికి ప్రత్యేక షెల్టర్. ఈ ప్రాంతాన్ని ‘డగౌట్’ అంటారు. బ్యాటింగ్ చేయని ఆటగాళ్ళు లేదా ఫీల్డింగ్ చేయని జట్టు సభ్యులు మ్యాచ్‌ను దగ్గరగా గమనించడానికి, అవసరమైనప్పుడు త్వరగా మైదానంలోకి వెళ్లడానికి ఇది వీలు కల్పిస్తుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లోకి అనధికార వ్యక్తుల ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలు (మొబైల్ ఫోన్లు వంటివి) ఉపయోగించకూడదు.

IPL 2026 : రంగంలోకి బీసీసీఐ

IPL 2026

వరుసగా జరుగుతున్న భద్రతా లోపాలు, ‘హనీ-ట్రాప్’ ముప్పులను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫ్రాంచైజీలకు 7 పేజీల కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను కలవకూడదు. కౌగిలించుకోరాదు. ఇవన్నీ పూర్తిగా నిషేధం . టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి ఇతరులు వెళ్లకూడదు. కుటుంబ సభ్యులకూ ముందస్తు అనుమతి తప్పనిసరి. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరిగితే జట్టు సభ్యులు… ఫ్రాంచైజీలపై భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పవు. ఇక ఐపీఎల్ నుంచి బహిష్కరణ తదితర కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది.

IPL 2026 : అడ్డంగా దొరికారు

IPL 2026

బీసీసీఐ నిబంధనలను బేఖాతరు చేస్తూ… మన క్రికెట్​ స్టార్లు అడ్డంగా దొరికారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (e-cigarette) చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఇది భారతీయ చట్టాలు , బీసీసీఐ నిబంధనల ప్రకారం నిషేధం. ఇంకేముందీ.. అతడికి మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డగౌట్ సమీపంలో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ దొరికిపోయాడు. యాంటీ కరప్షన్ (ACU) నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడకం నిషేధం, అందుకే అతనికి ₹1 లక్ష జరిమానా తప్పలేదు. కొంతమంది జట్టు యజమానులు లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డగౌట్ , ప్లేయింగ్ ఏరియాలోకి వెళ్లి ఆటగాళ్లను కలిసి, కౌగిలించుకున్నారు. ఇక అభిషేక్ శర్మ (SRH) అసభ్య పదజాలంతో నోరు జారాడు. .అంగ్క్రిష్ రఘువంశీ (KKR) అవుట్ కావటంతో కోపంలో హెల్మెట్, బ్యాట్‌ను నేలకేసి కొట్టి పరికరాలను ధ్వంసం చేశాడు. ఫలితంగా జరిమానా పడింది. ఆటగాళ్లు, సిబ్బంది తమ హోటల్ గదుల్లోకి టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రానిచ్చారు. ఇది ‘హనీ-ట్రాప్’ వంటి భద్రతా ముప్పులకు దారితీస్తుందని బీసీసీఐ హెచ్చరించింది.హోటళ్ల నుంచి బయటకు వెళ్లడం: కొంతమంది ఆటగాళ్లు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వేళల్లో హోటళ్ల నుంచి బయటకు వెళ్లినట్లు యాంటీ కరప్షన్ యూనిట్ గుర్తించింది. స్టేడియం ప్రాంగణంలో, డ్రెస్సింగ్ రూమ్‌లలో వేప్‌లు, ఇతర నిషేధిత వస్తువులను వాడటం ద్వారా నిబంధనలను అతిక్రమించారు . శ్రేయస్ అయ్యర్ (PBKS), శుభ్‌మన్ గిల్ (GT), రుతురాజ్ గైక్వాడ్ (CSK), హార్దిక్ పాండ్యా (MI) తదితర కెప్టెన్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. వీరికి బీసీపీఐ భారీ జరిమానా విధించింది.

IPL 2026 : ఫ్రాంచైజీల్లో అలజడి

IPL 2026

తాజాగా బీసీసీఐ విధించిన ఆంక్షలను అమలు చేయటంలో.. ఐపీఎల్ నిర్వాహకులు, ఫ్రాంచైజీలు జుట్టు పీకంకుంటున్నారు. ఇందుకు ఆధునిక జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం ప్రధాన కారణమని బీసీసీఐ గుర్తించింది. ముఖ్యంగా రీల్ కల్చర్ (Reel Culture) ప్రస్తుత తరం ఆటగాళ్లు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండటం, మ్యాచ్‌కు ముందు లేదా తర్వాత వెంటనే వీడియోలు (Reels) పోస్ట్ చేయడం ఒక వ్యసనంగా మారింది. డగౌట్, డ్రెస్సింగ్ రూమ్ తదితర అత్యంత సున్నిత ప్రాంతాల దృశ్యాలు బయటకు చేరుతున్నాయి. తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను, వ్లాగర్లను ఫ్రాంచైజీలు నియమించుకుంటున్నాయి. వీరికి ఆటగాళ్లతో ఉండే సాన్నిహిత్యం తో సెక్యూరిటీ పర్యవేక్షణ మేనేజ్‌మెంట్‌కు కష్టమవుతోంది. ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది తమ హోటల్ గదుల్లోకి టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా స్నేహితులను , ఇతర వ్యక్తులను రానివ్వడంతో ‘హనీ-ట్రాప్’ వంటి భద్రతా ముప్పులు పొంచి ఉన్నాయి. ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం . డగౌట్‌లో గానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ ఆటగాళ్లు , సహాయక సిబ్బంది ఫోన్లు వాడకూడదు. ఒకవేళ అత్యవసరమైతే టీమ్ మేనేజర్ వద్ద ప్రత్యేక ఫోన్ మాత్రమే వాడాలి. ఇది ‘బుకీలు’ లేదా ఇతర అనధికార వ్యక్తులు ఆటగాళ్లను కలవకుండా యజమానులకు నో-ఎంట్రీ నిబందన విధించారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు యజమానులు డగౌట్ లేదా ప్లేయింగ్ ఏరియాలోకి అస్సలు రాకూడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆటగాళ్లను కలవాలి. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్ దృశ్యాలను షూట్ చేసి పర్సనల్ అకౌంట్స్ లో పోస్ట్ చేయడాన్ని కట్టడి చేశారు.

IPL 2026 : బుకీల కట్టడి.. సాధ్యమా? అసాధ్యమా?

IPL 2026

డగౌట్ నిబంధనలను కఠినతరం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం బుకీలను స్పాట్ ఫిక్సింగ్‌ను కట్టడి చేయడమే. నిజ సమయ సమాచారం (Real-time data): సాధారణంగా స్టేడియం నుండి టీవీ ప్రసారానికి కొన్ని సెకన్ల జాప్యం (delay) ఉంటుంది. బుకీలు ఈ సమయాన్ని వాడుకుని బెట్టింగ్ రేట్లను తారుమారు చేస్తారు. డగౌట్‌లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లపై నిషేధం విధించడం వల్ల మైదానం లోపలి నుంచి సమాచారం క్షణాల్లో బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. డగౌట్‌లోకి యజమానులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇతర అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించడం ద్వారా ఆటగాళ్లకు బుకీల నుండి వచ్చే ముప్పులను (‘హనీ-ట్రాప్’ వంటివి) తగ్గించవచ్చు. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) ఇప్పుడు డగౌట్ , డ్రెస్సింగ్ రూమ్‌లపై నిరంతర నిఘా ఉంచుతోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ డగౌట్‌లో ఫోన్ వాడినందుకు జరిమానా విధించింది. ఈ నిఘాకు ఇది ఒక ఉదాహరణ. బుకీలు టెక్నాలజీని వాడుతూ.. అక్రమ వెబ్​ సైట్లు , టెలిగ్రామ్ ఛానెళ్ల తో తమ కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నారు. దీనిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నారు

ALSO READ : cricket | జైస్వాల్ , ష‌ఫాలీ వ‌ర్మ‌కు నోటీసులు

Leave a Reply