రేణిగుంట విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
రేణిగుంట, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, హ్యాండ్‌క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, అడిషనల్ ఎస్పీ శ్రీలత, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో నిర్వహించే ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి బయలుదేరి వెళ్లారు.


