సింగరేణి సంస్థను బతికించుకోవడమే లక్ష్యం – బాల్క సుమన్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సు బాల్క సుమన్ అధ్యక్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, బొగ్గు బావుల్లో టీబీజీకేఎస్‌ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సుమారు 16 వేల మంది కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని, కార్మికుల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, ఎల్లవేళలా కార్మికులకు అండగా ఉంటుందని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం ఆగదని నాయకులు తేల్చిచెప్పారు.

సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే కార్మికులంతా ఏకమై బీఆర్‌ఎస్‌ వెంట నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కొప్పులీశ్వర్, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పుట్ట మధు, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి రాజా రమేష్, కార్మికులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.