ఏజెన్సీ లో అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం..

ఏజెన్సీ లో అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం..
ఉట్నూర్ జీసీసీ డి ఎం గుడిమళ్ల సందీప్ కుమార్.
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ద్వారా అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించామని ఉట్నూర్ జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ తెలిపారు. శనివారం ఉట్నూర్ డివిజనల్ కార్యాలయంలో జిసిసి మేనేజర్లు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో సందీప్ కుమార్ మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రారంభించామని గిరిజనులు, ఆదివాసీలు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులైన ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండులను జీసీసీ సొసైటీ కార్యాలయాల వద్ద, డిఆర్ డిపోల వద్ద కు తీసుకొనివచ్చివిక్రయించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ మధ్య దళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని డి ఎం కోరారు.గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి ఎం సంతోష్ ఐఏఎస్,ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి యువరాజు మర్మాట్ వారి ఆదేశాల ప్రకారం అటవీ ఉత్పత్తుల కొనుగోలు వెంటనే ప్రారంభించని చోట వెంటనే అటవీ ఉత్పత్తులు ప్రారంభించాలని జిసిసి డిఎం సందీప్ కుమార్ కోరారు. గిరిజనులు, ఆదివాసీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని జీసీసీ డిపోల వద్ద విక్రయించి రశీదు పొందాలని ఈ సందర్భంగా సందీప్ కుమార్ సూచించారు.
అనంతరం ఉట్నూర్ జీసీసీ సొసైటీ కార్యాలయం లో సేల్స్ మెన్ తో ఏర్పాటు చేసిన సమావేశం లో సైతం మాట్లాడుతూ క్షేత్ర స్థాయి లో సిబ్బంది పర్యటించాలని, ఆదివాసీలకు, గిరిజనులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.. ఈ కార్యక్రమం లో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారా చంద్, మేనేజర్లు ఇస్తారి, రమేష్, మనోహర్, లక్ష్మణ్, డివిజనల్ ఆఫీస్ సిబ్బంది గులాబ్ సింగ్, లింబరావు, సత్యనారాయణ, సునీల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
