మెహర్ రమేష్ ఇంట పెళ్లి సందడి..

  • వైభవంగా కుమార్తె మోహన వివాహ వేడుక
  • సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో మోహన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నగరంలోని ఓ ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, హీరో వెంకటేష్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, వీర శంకర్, నిర్మాతలు బన్నీ వాసు, ఏఎం రత్నం, సి. అశ్వినీదత్, మురళీమోహన్, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, యాంకర్ సుమ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రముఖుల్లో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడిగా మెహర్ రమేష్ కన్నడలో ‘వీరకన్నడిగ’, ‘అజయ్’ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించగా, తెలుగులో ‘కంత్రి’, ‘బిల్లా’, ‘షాడో’, ‘భోళా శంకర్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.