మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం
తిరుపతి, ఆంధ్రప్రభ : రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఘన స్వాగతం లభించింది.
విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఆర్‌డీవో బానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, షాప్ చైర్మన్ రవి నాయుడు, మాజీ మంత్రి పనబాక లక్ష్మి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్స్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మతో పాటు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, నాయకులు వారికి స్వాగతం పలికారు.
