ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాల పరిశీలన

  • దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలకపూడి శంకర్‌బాబు
  • అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు..

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలకపూడి శంకర్‌బాబు సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఘాట్‌రోడ్డులోని లడ్డూ కౌంటర్‌ను పరిశీలించి, భక్తులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న శంకర్‌బాబు, శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు.