బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయి..
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ) : దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే ప్రజలను మోసం చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరపల్లి సీతారాములు విమర్శించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్న ఇరు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు వామపక్ష ఉద్యమాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గంగాదేవి సైదులు తదితరులు పాల్గొన్నారు.
